Back to feed
ఆంధ్రప్రదేశ్Breaking
గుంటూరు: పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు
Ravi Jun 11, 2026 6:50 AM గుంటూరు 3 views4 days ago

గుంటూరు రైల్వే స్టేషన్ యార్డులో డ్రైనేజీ పనుల కారణంగా గురువారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన వాటిలో గుంటూరు-విజయవాడ, గుంటూరు-రేపల్లెతో పాటు మరికొన్ని రైళ్లు ఉన్నాయి.
ట్రాక్ వద్ద ఆర్సీసీ బాక్సుల నిర్మాణ పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

