Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనా మార్కెట్లో గుంటూరు మిర్చికి ఎదురుదెబ్బ

Follow Udayam on Google
Ravi Jun 15, 2026 6:40 PM గుంటూరుGeneral
చైనా మార్కెట్లో గుంటూరు మిర్చికి ఎదురుదెబ్బ - Udayam
గుంటూరు నుండి చైనాకు ఎగుమతి చేసిన మిర్చిలో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉండటంతో, చైనా కస్టమ్స్ అధికారులు సరుకును తిరస్కరించారు. మూడు ఎగుమతి కంపెనీల కంటైనర్లను నిలిపివేస్తూ వారు ఆంక్షలు విధించారు. రైతులు సాగులో మిథామిడోపాస్ కెమికల్ వినియోగించడమే ఇందుకు కారణమని తేలింది. ఈ పరిస్థితిపై ఎగుమతిదారులు ఆందోళన చెందుతూ, సదరు పురుగుమందు లైసెన్సును రద్దు చేయాలని కోరుతూ ఉద్యానశాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Comments

G
Loading comments...