వార్తలకు తిరిగి వెళ్లండి

బదిలీల్లో నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించారు. స్పౌజ్ కేటగిరీ, అనారోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై టీజీజీడీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌తో సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నిరసన కొనసాగుతోంది. అత్యవసర శస్త్రచికిత్సలు తప్ప, మిగిలిన ఆపరేషన్లను కూడా నిలిపివేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సమ్మె వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

