గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి హత్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి రాజశేఖర్ (30) హత్యకు గురయ్యారు. పవర్హౌస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు ఫోన్ చేసి ఆయనను ఇంటి బయటకు పిలిపించి కత్తులతో దాడి చేసినట్లు సమాచారం.
ఈ దాడిలో నలుగురు యువకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...
