Back to feed
నేరేడు, ఈత పండ్లతో అమ్మవారి రూపం
Rakesh Jun 12, 2026 9:22 AM చిత్తూరు 8 views3 days ago

చిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నేరేడు పళ్ళు, ఈత పళ్ళు, పుష్పాలతో ఎంతో సుందరంగా అలంకరించారు.
అంతకుముందు ఆలయంలో అమ్మవారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం, ఫల పుష్ప నివేదనలు జరిగాయి. దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా, ఈ విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Loading comments...

