Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు.. ఆరుగురిపై కేసు: మునగపాక ఎస్ఐ

Follow Udayam on Google
saladi.syam Sep 22, 2026 10:23 AM అనకాపల్లివినోదం
గణేశ్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు.. ఆరుగురిపై కేసు: మునగపాక ఎస్ఐ - Udayam
మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో వినాయక నిమజ్జనం వేళ నిబంధనలు ఉల్లంఘించి అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో అసభ్యకర డాన్సులు వేయించినట్లు గుర్తించామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. నిర్వాహకులు కొడమంచిలి విష్ణు, నారిపల్లి వివేక్, కంఠంరెడ్డి నాగేశ్వరరావు, కర్రి భానుప్రసాద్, తలపాల అనిల్ కుమార్పై చట్టపరమైన చర్యలు చేపట్టామన్నారు.

Comments

G
Loading comments...