Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాడలో రోడ్డు పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 6:32 PM పార్వతీపురం మన్యంGeneral
గంగాడలో రోడ్డు పనులకు శ్రీకారం - Udayam
బలిజిపేట మండలం గంగాడలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సోమవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే తన ప్రధాన బాధ్యతని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు రూ.52 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు.

Comments

G
Loading comments...