Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువులోగా ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 1:14 PM ఆదిలాబాద్General
గడువులోగా ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలి - Udayam
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యలను విన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సూచించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...