వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకొల్లు మండలం దుద్దుకూరు శివాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం రెండో రోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమాభిషేకం నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

