వార్తలకు తిరిగి వెళ్లండి
కంపెనీ ఉద్యోగి నుంచి కెప్టెన్‌గా.. కాన్పూర్ కుర్రాడి అద్భుత ప్రయాణం!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినాయక్ శుక్లా ఓమన్ జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించాడు. బతుకుదెరువు కోసం ఓమన్ దేశానికి వెళ్లి, అక్కడ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే తన ప్రతిభతో ఈ అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నాడు.
యూపీలోని కాన్పూర్‌లో జన్మించిన 31 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. కోవిడ్ కారణంగా విదేశాల్లో కష్టాలు పడి భారత్‌కు తిరిగి వచ్చినప్పటికీ, పట్టుదలతో శ్రమించి ప్రస్తుతం ఓమన్ దేశ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.
Comments
Loading comments...