Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఉచిత చేప మందు పంపిణీ

Ravi Shukla Jun 06, 2026 2:23 AM హైదరాబాద్ 3 viewsabout 4 hours ago
ఉచిత చేప మందు పంపిణీ - Udayam Digital
మృగశిర కార్తి సందర్భంగా జూన్‌ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జన్‌సేవా సంఘ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆ సంఘ అధ్యక్షుడు బిస్వాజిత్‌ సింగ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆస్తమా రోగులకు కిచిడి, పండ్లు, మరియు శుద్ధిచేసిన తాగునీరు ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు ప్రకాశ్‌ చౌదరి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...