Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లోకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్

Follow Udayam on Google
Ravi Singh Jun 03, 2026 12:03 PM జాతీయంబిజినెస్
భారత్‌లోకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ - Udayam
మారుతి సుజుకి దేశంలోనే మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ వ్యాగన్ఆర్ కారును జూన్ 4న మార్కెట్లోకి విడుదల చేయనుంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి ఈ సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కారు ఏకంగా 100 శాతం ఇథనాల్ ఇంధనంతో కూడా నడవగలదు. సాధారణ కార్ల కంటే దీని ధర రూ.50,000 వరకు అదనంగా ఉండే అవకాశం ఉంది. ఇథనాల్ ఇంధన లభ్యత కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Comments

G
Loading comments...