Back to feed
కూలర్ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి
Saniya Verma Jun 01, 2026 10:46 AM నిర్మల్ 1 viewsabout 1 hour ago

నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని కోరికంటి తండాలో విషాదం నెలకొంది. ఇంట్లో కూలర్‌లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్‌కు గురై తండ్రి రాథోడ్ అర్జున్, కుమారుడు శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. ఇనుప రాడుతో నీళ్లు పోస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...



