వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. నెల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు మనస్పర్థలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య వెంకటరమణ ఉరివేసుకోగా, ఆ బాధ తట్టుకోలేక భర్త మహేశ్ రైలు కిందపడి ప్రాణాలు విడిచాడు.
ఐదేళ్లుగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఇలా తనువు చాలించడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

