వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఐడీఓసీ ప్రాంగణంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన నీటి నిల్వ చెరువును కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ప్రారంభించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఈ నిర్మాణం ఎంతో కీలకం కానుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో నీటిని పొదుపు చేసే ఇటువంటి చర్యలు పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

