ఎండు మిర్చి దందా.. దళారుల దోపిడీ!

నగరంలో ఎండు మిర్చి డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొని, జీఎస్టీ చెల్లించకుండా కోట్ల రూపాయల మోసానికి పాల్పడుతున్నారు. మలక్‌పేట గంజ్, బేగంబజార్ మార్కెట్లలో సీజన్‌కు 8 వేల క్వింటాళ్ల వరకు వ్యాపారం జరుగుతోంది.
హోల్‌సేల్‌లో కిలో రూ.140 ఉన్న మిర్చిని రిటైల్‌లో నాణ్యత పేరుతో రూ.440 వరకు అమ్ముతూ వినియోగదారులపై ధరాఘాతం మోపుతున్నారు.
Comments
Loading comments...
