వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలం కోలూర్‌కు చెందిన రైతు షేక్ హబీబ్ రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినా, నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఎండ తీవ్రతకు పంట పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడి దక్కకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆయన ఆవేదన చెందుతున్నారు.
మండలంలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

