వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఈసారి జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గతంలో రెండు పర్యాయాలు బీసీ మహిళలకు అవకాశం దక్కగా, ఈసారి కాపు సామాజికవర్గం నుంచి మహిళను ఎంపిక చేయాలని వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ధర్మవరం వీధికి చెందిన ఓ ప్రముఖ కుటుంబ మహిళకు టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

