ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన

బంగాళాఖాతంలో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది. కొమొరిన్ నుంచి రాయలసీమ వరకు విస్తరించిన ఈ ద్రోణి ప్రభావంతో ఏపీ, యానాంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి.
దీంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది.
Comments
Loading comments...
