వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ మీడియా సంస్థ న్యూస్‌క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై నమోదైన మనీల్యాండరింగ్ కేసును ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అమెరికా సంస్థ నుండి అక్రమంగా విదేశీ నిధులు సేకరించారనే ఆరోపణలపై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ రద్దు చేశారు.
ఈ కేసులో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. పెట్టుబడి ఒప్పందం ప్రకారమే నిధుల బదిలీ జరిగిందని స్పష్టం చేస్తూ సంస్థకు ఊరటనిచ్చింది.
Comments
Loading comments...

