వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం భారత్‌లో ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత దేశాల నుండి వచ్చే ప్రయాణికులు నిఘాలో ఉండాలని సూచించింది.
గత 21 రోజుల్లో ఎబోలా పీడిత దేశాల నుండి వచ్చిన వారికి జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆదేశించింది. అత్యవసర సాయం కోసం '1075' హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

