వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణంలోని బాగులవాడలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గురువారం దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో భక్తులు, భవాని మాలాధారులు అమ్మవారికి 108 బోనాలు సమర్పించారు.
ప్రత్యేకంగా అలంకరించిన బోనాలను కాలనీలో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకోగా, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

