వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాజీపేటలో దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈవో నాగ స్వర్ణలత హెచ్చరించారు. ప్రత్యేక తరగతులు, ట్యూషన్ల పేరుతోనూ క్లాసులు నిర్వహించకూడదని స్పష్టం చేశారు.
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రేపటి నుంచి దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ సూచనలు చేశారు.
Comments
Loading comments...

