Udayam Digital
Menu

ధర్మానకు హైకోర్టులో ఊరట

Shruthi Nov 28, 2026 5:57 PM శ్రీకాకుళంGeneral
ధర్మానకు హైకోర్టులో ఊరట - Udayam Digital
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి తరఫున జనరల్ ఎలక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించేందుకు అవకాశం కల్పించింది. కౌంటింగ్ ప్రక్రియలో ధర్మానను అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు ఆయన కౌంటింగ్‌లో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...