వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై బాంద్రా తీరానికి కొట్టుకొచ్చిన 26 అడుగుల హంప్‌బ్యాక్ తిమింగలం పిల్ల మృతిచెందింది. అటవీ, అగ్నిమాపక శాఖాధికారులు గంటల తరబడి శ్రమించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, చివరకు అది మరణించిందని అధికారులు ధృవీకరించారు.
సముద్ర ప్రవాహాల వల్ల దారి తప్పి ఒడ్డుకు చేరినట్లు భావిస్తున్నారు. పూర్తిస్థాయి పరీక్షల అనంతరం తిమింగలాన్ని ఖననం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. మృతికి గల ఖచ్చితమైన కారణాలను పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడిస్తామన్నారు.
Comments
Loading comments...

