వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ 'అపాయింటెడ్ డే' ప్రకటించాలని టీజేఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సామూహిక దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. యూనియన్ ఎన్నికల కంటే ముందే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.
విలీనానికి ముందు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్న మంత్రి ప్రకటనపై ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ఈ దీక్షలో యూనియన్లకు అతీతంగా ఉద్యోగులందరూ పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

