వార్తలకు తిరిగి వెళ్లండి

అకాల వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. పూర్తయిన కేంద్రాల నుంచి టార్పాలిన్లను అవసరమైన చోటికి తరలించాలని అధికారులకు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

