వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్పేట మండలం చాకలిపల్లిలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామస్థులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

