Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బురదమయంగా కర్రగూడ–దిగువ దారబ రహదారి

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:25 PM పార్వతీపురం మన్యంGeneral
బురదమయంగా కర్రగూడ–దిగువ దారబ రహదారి - Udayam
సీతంపేట మండలం కర్రగూడ–దిగువ దారబ గ్రామాలకు వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రహదారికి ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరగడంతో ప్రయాణం మరింత కష్టంగా మారింది. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...