వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర ఆర్జీయూకేటీ మెస్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆదివారం ఉదయం విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో బొద్దింక రావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే ఆహారంలో కప్పలు, బల్లులు రావడంతో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాత నిర్వాహకులకే కాంట్రాక్టులు అప్పగించడంపై విద్యార్థులు నిరసనలు చేస్తున్నా, అధికారులు మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఇన్‌ఛార్జి ఉపకులపతి గోవర్ధన్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

