వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ రక్తదాతల దినోత్సవం వేళ అనంతపురానికి చెందిన దబ్బర నవీన్ కుమార్ 48వ సారి రక్తదానం చేశారు. గతంలో రక్తం లేక తన తల్లి పడిన ఇబ్బందులను తెలుసుకున్న ఆయన, ఇంకెవరూ అలా బాధపడకూడదనే ఉన్నత ఆశయంతో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇటీవలే మరణించిన తన తల్లికిచ్చిన మాట కోసమే నిరంతరం రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర సమయాల్లో 'బి పాజిటివ్' రక్తం అందిస్తానని నవీన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

