వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా చేర్యాలలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్‌లో మాజీ ప్రజాప్రతినిధి తింటున్న బిర్యానీలో ఇనుప తీగ ప్రత్యక్షమైంది. ఈ విషయమై యజమానితో వివాదం చెలరేగడం, ఆపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో అధికారులు స్పందించారు.
మున్సిపల్ కమిషనర్ సదరు రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టి యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆహార నాణ్యతా లోపానికి గాను యజమానికి రూ.2 వేల జరిమానా విధించారు.
Comments
Loading comments...

