వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా ఉండేందుకు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం తక్షణ నిషేధం విధించింది. ముడి, తెల్ల మరియు శుద్ధి చేసిన చక్కెర రకాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది.
అయితే, ఇప్పటికే లోడింగ్ పూర్తయిన స్టాక్స్‌కు మినహాయింపు ఇచ్చారు. ఐరోపా, అమెరికా దేశాలతో కుదుర్చుకున్న పాత ఒప్పందాలకు ఈ నిషేధం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

