బాచుపల్లిలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్ బాచుపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. దినేశ్ హారిక్ అపార్టుమెంట్‌లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు కార్మికులు మృతి చెందారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మృతులను సుమన్ (24), సురేష్ (25), పవన్ (25)గా గుర్తించారు. వీరు హెచ్‌ఆర్ ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కంపెనీకి చెందినవారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
