వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం నంజిరెడ్డిపల్లి క్రాస్ శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.35,130 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

