వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై ప్రమాదకర మూలమలుపు వాహనదారులకు ఇబ్బందిగా మారింది. వేగంగా వచ్చే వాహనాలను అదుపు చేయడం కష్టమవుతుండగా, సూచిక బోర్డులు కూడా లేవు.
గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాన్వాయ్ ఇక్కడ అదుపుతప్పి బోల్తాపడగా, ఓ సిబ్బంది మృతి చెందారు. అధికారులు స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

