Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పాయిపల్లిలో శిథిలావస్థకు చేరిన వాటర్‌ ట్యాంక్‌

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:06 PM నాగర్ కర్నూల్General
అప్పాయిపల్లిలో శిథిలావస్థకు చేరిన వాటర్‌ ట్యాంక్‌ - Udayam
లింగాల మండలం అప్పాయిపల్లిలో సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన తాగునీటి వాటర్‌ ట్యాంక్‌ శిథిలావస్థకు చేరింది. నిత్యం పెచ్చులు ఊడిపడుతుండటంతో ట్యాంక్‌ ఎప్పుడు కూలిపోతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంక్‌ కూలితే తాగునీటి సమస్య తలెత్తుతుందని వాపోతున్నారు. అధికారులు స్పందించి పాత ట్యాంక్‌ స్థానంలో కొత్తది నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...