వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు గవర్నర్‌కు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

