వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు పత్తేబాద నాలుగు గుళ్ల సెంటర్‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వెంకట రామ్మూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.
అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఆహార కొరత ఉండదని, సిరిసంపదలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

