వార్తలకు తిరిగి వెళ్లండి

హవేలీఘనపూర్ మండలంలోని దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అర్చకులు తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

