Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి సేవలో హైకోర్టు సీజే

Follow Udayam on Google
Sai Kumar Jun 12, 2026 12:41 PM తిరుపతిGeneral
శ్రీవారి సేవలో హైకోర్టు సీజే - Udayam
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. ఈవో, అదనపు ఈవోలు కలిసి సీజే జస్టిస్ లీసా గిల్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...