వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిపై వైకాపా దుష్ప్రచారాలు ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ హెచ్చరించారు. అమరావతిలో బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన ఆయన, అభివృద్ధి పనులపై అబద్ధాలు ప్రచారం చేయడం తగదని మండిపడ్డారు.
ఐకానిక్ భవనాల నిర్మాణానికి వ్యయం సహజమని, ఇతర రాష్ట్రాల ప్రాజెక్టుల ఖర్చులను వైకాపా నేతలు కావాలనే విస్మరిస్తున్నారని విమర్శించారు. కేంద్రం కూడా అమరావతి నిర్మాణానికి సహకరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

