వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా చింతపల్లిలో గంజాయి వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. హెడ్ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించడంతో, పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నలుగురు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారు. వీరి నుంచి 290 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

