Udayam Digital
Menu

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి

Anuroop Nov 27, 2026 10:47 AM నల్గొండGeneral
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి - Udayam Digital
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పోలీసులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. నవంబర్ 16న యాదగిరిపల్లి శివారులో తనిఖీల్లో వాటిని పట్టుకున్నారు. డ్రైవర్లు నారబోయిన సతీష్, నల్లమేకల చందు, యజమానులు ఉత్తర్ల గోపి, సల్లోజు సతీష్‌పై కేసులు నమోదు చేశారు. ట్రాక్టర్లను మైనింగ్ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్సై ఉప్పు నగేష్ తెలిపారు.

Comments

G
Loading comments...