Back to feed
గుజరాత్‌లో విమానాల తయారీ ప్లాంట్
Vikram Jun 17, 2026 2:33 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

బ్రెజిల్ విమాన దిగ్గజం ఎంబ్రాయర్, అదానీ గ్రూప్ కలిసి గుజరాత్‌లోని ధోలెరాలో ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. భారత పౌర, రక్షణ విమాన రంగాలలోని అవకాశాలను అందుపుచ్చుకోవడమే లక్ష్యంగా ఇరు సంస్థలు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఈ మెగా ప్రాజెక్టు ద్వారా భారత్‌లోకి ప్రాంతీయ రవాణా విమానాలు రానున్నాయి. ప్రస్తుతం దేశంలో వైమానిక దళంతో పాటు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్ల పరిధిలో ఎంబ్రాయర్‌కు చెందిన 50 విమానాలు విజయవంతంగా సేవలందిస్తున్నాయి.
Comments
Loading comments...



