వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ విమాన ప్రయాణికులకు ఎయిరిండియా సరికొత్త చౌక టికెట్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ప్రయాణించాలనుకునే వారి కోసం ఎకానమీ క్లాస్‌లో కాంప్లిమెంటరీ భోజనం లేకుండా, కేవలం ఉచిత టీ లేదా కాఫీతో కూడిన ప్రాథమిక ఛార్జీల అవకాశాన్ని కల్పించింది.
ఈ టికెట్ కింద ప్రయాణికులు 15 కిలోల చెక్డ్‌ఇన్, 7 కిలోల కేబిన్ బ్యాగేజీని తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని, భవిష్యత్తులో వినియోగదారుల స్పందన ఆధారంగా కొనసాగించనున్నారు.
Comments
Loading comments...

