అహోబిలంలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ

నంద్యాల జిల్లా అహోబిలంలో పోలింగ్ వేళ టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రిగ్గింగ్ ఆరోపణలతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి.
ఈ ఘటనలో అఖిలప్రియ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...
