వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నాయకులు, ప్రజలు సహకరించాలని సీఐ చంద్రశేఖర్ కోరారు. ఎం.జగన్నాథపురంలో మంగళవారం రాత్రి నిర్వహించిన పల్లెనిద్రలో ఎన్నికల నిబంధనలు, శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రజలకు వివరించారు. అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
Comments
Loading comments...

