Udayam Digital
Menu

అచ్చంపేటలో పశు పరిశోధన కేంద్రాలు

Anuroop Nov 27, 2026 12:43 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేటలో పశు పరిశోధన కేంద్రాలు - Udayam Digital
నల్లమల పశు సంపద, పాలమూరు గొర్రెలకు ప్రత్యేక గుర్తింపు దక్కనుంది. అచ్చంపేటలో 100 ఎకరాల్లో తూర్పు పొడ గిత్తలు, దక్కనీ గొర్రెల కోసం రెండు పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.20.31 కోట్లు కేటాయిస్తూ గురువారం జీవో జారీ చేసింది. తూర్పు పొడ గిత్తలు దృఢత్వం, శ్రమకు ప్రసిద్ధి కాగా.. దక్కనీ గొర్రెలు మాంసం, ఉన్నికి పేరుగాంచాయి.

Comments

G
Loading comments...