Udayam Digital
Menu

ఆసిఫ్‌నగర్‌లో 70 తులాల చోరీ

Shruthi Nov 28, 2026 3:17 PM హైదరాబాద్General
ఆసిఫ్‌నగర్‌లో 70 తులాల చోరీ - Udayam Digital
ఆసిఫ్‌నగర్ జేబా బాగ్ డీ-క్లాస్‌లోని మహమ్మద్ వాసిం ఇంట్లో భారీ చోరీ జరిగింది. నవంబర్ 27న కుటుంబ సభ్యులు కార్యక్రమానికి వెళ్లిన సమయంలో దొంగలు బీరువాలోని 70 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...